‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ డే’ రికార్డులివి!

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గురించి తెలియని వారుండరు. చాలా మంది ఈ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వినూత్న, విభిన్న పనులు చేసి రికార్డు సాధిస్తుంటారు. అలా రికార్డు నెలకొల్పిన వారి గురించి గిన్నిస్‌ సంస్థ.. తమ రికార్డు బుక్‌లో

Published : 25 Nov 2020 23:47 IST

అదరగొట్టిన భారతీయులు


(Photo:Guinness World Records.com)

ఇంటర్నెట్‌ డెస్క్‌: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గురించి తెలియని వారుండరు. చాలా మంది ఈ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వినూత్న, విభిన్న పనులు చేసి రికార్డు సాధిస్తుంటారు. అలా రికార్డు నెలకొల్పిన వారి గురించి గిన్నిస్‌ సంస్థ.. తమ రికార్డు బుక్‌లో ప్రచురిస్తుంటుంది. అలాగే ఈ సంస్థ ఏటా నవంబర్‌ 18న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌(జీడబ్ల్యూఆర్‌)డే పేరుతో వేడుక నిర్వహిస్తుంటుంది. ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా కొందరు కొన్ని విభాగాల్లో రికార్డులు సృష్టించారు. భారతీయులూ పలు రికార్డులు సాధించడం విశేషం. అవేంటో చూద్దామా..!

* ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాకి చెందిన ప్రభాకర్‌రెడ్డి తలతో ఒక్క నిమిషంలో 68 కూల్‌డ్రింక్స్‌ మూతలు తీసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. అతడికి సుజిత్‌ కుమార్‌, రాకేశ్‌ సహకరించారు. 

* భారత్‌కు చెందిన రామ్‌కుమార్‌ సారంగపాణి ఏకంగా ఆరు రికార్డులు బద్దలుకొట్టాడు. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డులు సాధించాడు.

 - అత్యంత చిన్న సైజు పేకముక్కలను తయారు చేశాడు. వాటి సైజు కేవలం 7మి.మీ×5మి.మీ×4.86మి.మీ

 - అయస్కాంతాలతో అతి పెద్ద వాక్యం రూపొందించాడు. 50,102 అయస్కాంత ముక్కలతో ‘I LOVE U.A.E’ అని రాశాడు.

 - అయస్కాంతాలతో అతి పెద్ద పదం ‘DUBAI’ రూపొందించి మరో రికార్డు సాధించాడు. ఇందుకోసం 50,020 అయస్కాంత ముక్కలను వినియోగించాడు.

 - బ్యాంక్‌ నోట్లతో అతి పెద్ద పదం ‘UAE’ని రాశాడు. దీనికి 3,040 నోట్లను ఉపయోగించాడు. 

 - 5,005 బ్యాంక్‌ నోట్లతో అతి పెద్ద వాక్యం ‘GWR DAY 2020’ని పేర్చి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. 

 - అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ గ్రీటింగ్‌ కార్డు రూపొందించి మరో రికార్డు కొట్టాడు. ఈ గ్రీటింగ్‌ కార్డు సైజు 12చ.మీటర్లు

* భారత్‌లోని చెన్నైకి చెందిన హూపర్స్‌ గ్రూప్‌ సభ్యులు పలు రికార్డులు సాధించారు. 

 - ఆర్‌.ఎస్‌ తరుణ్‌ 6నిమిషాల 7సెకండ్లు స్కేటింగ్‌ చేస్తూ హూలా హూప్స్‌ రింగులను తిప్పి.. ఎక్కువసేపు స్కేటింగ్‌ చేస్తూ రింగులను తిప్పిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

 - ఎస్‌. కనిష్క నేలపై పడుకొని కాళ్లతో 136 రింగులను తిప్పి మరో రికార్డు సృష్టించారు.

 - ఎం.ఎస్‌ హాసినీ ఒక్క నిమిషంలో అత్యధికంగా 99 వాహనాల లోగోలను గుర్తించారు.

* చెన్నైలోనే గోకుల్‌నాథ్‌ యూనిక్‌ టాలెంట్‌ అకాడమీ నుంచి గిన్నిస్‌ బుక్‌లో మూడు రికార్డులు నమోదయ్యాయి.

 - గోకుల్‌నాథ్‌ ఒక్క నిమిషంలో అత్యధిక 77 పొయ్‌ ఎయిర్‌ రాప్స్‌ చేశాడు.

 - కె. నాగరాజు ఒక్క నిమిషంలో 2 కేజీల బరువున్న హూలా హూప్‌ రింగులను 144 సార్లు తిప్పాడు.

 - ఎస్‌. రియన్నా ఆండ్రియా, ఆండ్రియా వార్గేసి, ఏ.ఎస్‌. ఐశ్వర్య ఈ ముగ్గురు కలిసి హూలా హూప్‌ను ఒక్కనిమిషంలో 66సార్లు తిప్పారు. మోస్ట్‌ రోటేషన్‌ ఆఫ్‌ హూలా హూప్‌ బై త్రీ మెంబర్స్‌ కేటగిరీలో ఈ రికార్డు నెలకొల్పారు.

* దక్షిణాఫ్రికాకు చెందిన థామస్‌ బట్లర్‌ వాన్‌ టొండర్‌ అత్యంత వేగంగా 50 మీటర్ల తాడును ఎక్కేశాడు. ఆ తాడు ఎక్కడానికి అతడు తీసుకున్న సమయం కేవలం 3 నిమిషాల 19.68సెకండ్లు. 

* చైనాకు చెందిన రెన్‌ కెయూ వయసు పద్నాలుగు. ఎత్తు మాత్రం 7 అడుగుల 3.02 అంగుళాలు. గిన్నిస్‌ రికార్డు సంస్థ రెన్‌ను అత్యంత పొడవైన టీనేజీ కుర్రాడిగా గుర్తించింది. 

* రష్యాకి చెందిన ఆండ్రే మాస్లోయ్‌ రూబిక్‌ క్యూబ్‌ ఆడుతూ అత్యంత ఫాస్ట్‌గా వంద మీటర్లు పరుగెత్తిన వ్యక్తిగా రికార్డు సాధించాడు.

* యూకేకి చెందిన మార్టిన్‌ రీస్‌ నీళ్లలో మునిగి మూడు నిమిషాల్లో అత్యధిక మ్యాజిక్‌ ట్రిక్స్‌ చేసి చూపించి రికార్డు కొట్టాడు. 

ఇలాంటి రికార్డులు మరికొన్ని ఈ వీడియోలో చూడండి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని