భారత విమాన తయారీ రంగంలో కీలక మైలురాయి

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) మరో మైలురాయి అందుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హిందుస్థాన్‌-228’ విమానానికి సంబంధించిన గ్రౌండ్‌ రన్‌, లో స్పీడ్‌ ట్యాక్సీ(తక్కువ వేగంతో ప్రయాణం) ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది.

Published : 17 Aug 2021 01:36 IST

విజయవంతంగా హెచ్‌ఏఎల్‌ ‘హిందుస్థాన్‌-228’ ట్రయల్స్‌

బెంగళూరు: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) మరో మైలురాయి అందుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హిందుస్థాన్‌-228’ విమానానికి సంబంధించిన గ్రౌండ్‌ రన్‌, లో స్పీడ్‌ ట్యాక్సీ(తక్కువ వేగంతో ప్రయాణం) ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. డీజీసీఏ ‘టైప్‌ సర్టిఫికేషన్‌’ కోసం కాన్పూర్‌లోని హెచ్‌ఏఎల్‌ డివిజన్‌లో ఈ ట్రయల్స్‌ చేపట్టినట్లు సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ వింగ్‌ సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇది. దేశీయ విమానయానాన్ని బలోపేతం చేసే దిశగా ఇది ఒక ముందడుగ’ని హెచ్‌ఏఎల్‌ అధికారి సజల్ ప్రకాశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ‘ఎఫ్‌ఏఆర్‌ 23 సర్టిఫికేషన్’ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. 19 సీట్లతో కూడిన ఈ విమానాలను.. ప్రయాణికుల రవాణా, ఎయిర్ అంబులెన్స్, వైమానిక నిఘాతోపాటు పారా జంపింగ్, ఫొటోగ్రఫీ తదితర వినోద కార్యకలాపాలకూ వినియోగించవచ్చని హెచ్‌ఏఎల్‌ తెలిపింది. దేశంలో వాయు రవాణాను మరింత అభివృద్ధి చేసేందుకుగానూ కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా ఇక్కడ ఈ విమానాలను రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని