Harsh Goenka: డబ్బులతో కొనలేనివీ ఉంటాయి..!

మన జీవితంలో డబ్బుతో కొనలేని వస్తువులుంటాయని.. రోజువారీ హడావుడిలో పడి వాటిని కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యమని

Published : 03 Sep 2021 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన జీవితంలో డబ్బుతో కొనలేని వస్తువులుంటాయని.. రోజువారీ హడావుడిలో పడి వాటిని కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యమని ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంకా నెటిజన్లకు సలహా ఇచ్చారు. ఆయన జీవితానుభవాల నుంచి నేర్చుకున్న మంచి విషయాలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన డబ్బు గురించి గురువారం ట్వీట్‌ చేశారు.

‘డబ్బులు ఉంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. దాంతో ఎన్ని వస్తువులైనా కొనుగోలు చెయొచ్చు. కానీ, డబ్బుతో కూడా కొనలేనివీ కొన్ని ఉంటాయి. వాటిని కోల్పోకూడదు. ఒకసారి వాటిని కోల్పోతే తిరిగి పొందలేము’అని పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు సైతం ఏకీభవిస్తూ రీట్వీట్‌ చేస్తున్నారు. ‘నిజమే.. డబ్బుతో చాలా ఖరీదైన వాటిని కొనొచ్చు. కానీ, కాలాన్ని మాత్రం కొనలేం’ అని ఒకరు, ‘డబ్బుతో కొనుగోలు చేయలేనివి మరింత సంతృప్తినిస్తాయి. వాటిని నిధిగా ఉంచుకోవడం ముఖ్యం’ అని మరొకరు కామెంట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని