Guinness World Records : ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయలను చూశారా?

మనలో చాలా మందికి ఇష్టమైన పనుల్లో ‘గార్డెనింగ్‌’ ఒకటిగా ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ అప్పుడు ఎంతో మందికి మొక్కల పెంపకం అనేది  కాలక్షేపంగా మారింది. సొంత కిచెన్ గార్డెన్‌ల్లో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలతో పండించడం చూశాం.

Published : 15 Nov 2021 23:50 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలా మందికి ఇష్టమైన పనుల్లో ‘గార్డెనింగ్‌’ ఒకటిగా ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మందికి మొక్కల పెంపకం అనేది  కాలక్షేపంగా మారింది. ఇక్కడ మీరు చూస్తున్న వారంతా ఖాళీ సమయంలో మొక్కల పెంపకం మీద దృష్టి పెట్టిన వారే. అయితే వీరెవరూ దీన్నో వ్యాపకంగా భావించలేదు. అందరూ కూరగాయలను సాధారణ సైజులో ఉన్నట్లు పెంచితే వీరు మాత్రం బడా సైజులో పెంచి.. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కేశారు. ముల్లంగి, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు, బీన్స్‌తో సహా కూరగాయలను భారీ సైజులో పండించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తాజాగా ప్రకటించింది. బ్రిటన్‌లోని మార్వెన్‌లో ఈ వేడుక జరగగా.. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల టైటిల్‌ కోసం వీరంతా తాము పెంచిన కూరగాయలను అక్కడికి తీసుకొచ్చి ఇలా నవ్వులు చిందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని