Offbeat : కొత్త అల్లుడికి 365 వంటకాలతో భోజనం... ఎక్కడంటే?

గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు.

Published : 17 Jan 2022 01:25 IST

నరసాపురం: గోదారోళ్లు అంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. ఇక కొత్త అల్లుళ్లకైతే.. ఆ మర్యాదల గురించి చెప్పక్కర్లేదు. అయితే.. పశ్చిమగోదావరిలో ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల పిండివంటలతో ఆతిథ్యమిచ్చింది. అన్నం, పులిహోర, బిర్యానీ, దద్యోదనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్‌లు, 35 రకాల శీతల పానీయాలు, 15 రకాల కేకులతో.. భోజనం పెట్టారు. ఈ భారీ భోజనం గురించి పూర్తి వివరాలు ఈ దిగువ వీడియోలో...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని