ఆ ఘనత విజయవాడ విమానాశ్రయానిదే!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే ‘వందే భారత్‌’ మిషన్‌లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించిందని ...

Published : 20 Aug 2020 10:57 IST

విజయవాడ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే ‘వందే భారత్‌’ మిషన్‌లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించిందని విమానాశ్రయం డైరెక్టర్‌ మధుసూదరరావు అన్నారు. మిషన్‌లోని నాలుగు దశల్లో భాగంగా మే 20వ తేదీ నుంచి బుధవారం(ఆగస్టు 19) వరకు 98 విమానాలు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయని తెలిపారు. ఇవాళ రానున్న రెండు సర్వీసులతో ఆ సంఖ్య 100కు చేరుకుంటుందని వివరించారు. 

యూఏఈ, అమెరికా, లండన్‌, సౌదీ అరేబియా, యూకే, మలేషియా, సింగపూర్‌, షార్జా, ఖతార్‌, ఫిలిప్పీన్స్‌, రాస్‌ ఆల్‌ ఖైమా, దుబాయ్‌, కువైట్‌ తదితర దేశాల నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తరలివచ్చినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ఇంతమంది ప్రయాణికులను సురక్షితంగా తమ స్వస్థలాలకు చేర్చిన ఘనత దేశంలోనే విజయవాడ విమానాశ్రయానికి దక్కుతుందని అధికారులు తెలిపారు. వందే భారత్ మిషన్ అంచనాలతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయి అభివృద్ధి సాధిస్తుందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని