
రెల్వే స్టేషన్లో సొరంగ అక్వేరియం
బెంగళూరు: రైల్వే స్టేషన్కు ఎందుకు వెళతారు అని ఎవరినైనా అడిగితే రైలు ప్రయాణానికి అని చెబుతారు లేదంటే తమ వారిని రైలెక్కించడానికి లేదా తీసుకురావడానికి అని అంటారు. అయితే బెంగళూరు వాసులు ఇంకో మాట కూడా చెబుతున్నారు. రైల్వే స్టేషన్లో అక్వేరియం చూడడానికి వెళుతున్నామని అంటున్నారు. కాస్త వింతగా ఉన్నా ఇది నిజమే. దేశంలోనే రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన తొలి అక్వేరియం గురువారం బెంగళూరులో ప్రారంభమైంది.
నగర సిగలో మరో వన్నె చేరింది. దేశంలో రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన తొలి అక్వేరియం అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ అక్వేరియాన్ని ప్రారంభించారు. సొరంగంలో ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత. ప్రయాణీకులను, పర్యాటకులను అకట్టుకునేందుకు ఈ అక్వేరియంను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్, హెచ్అండ్ఎస్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. రకరకాలైన చేపలు, తాబేళ్లు, ఎండ్రకాయలను ఈ అక్వేరియంలో ఉంచారు.