IRCTC: 6 టికెట్ల కంటే ఎక్కువ బుక్‌ చేయాలా?

ఐఆర్‌-సీటీసీలో నెలకు ఆరు కంటే ఎక్కువ (గరిష్ఠంగా 12) రైల్వే టికెట్లను బుక్‌ చేయాలంటే ఇకపై మీ ఆధార్‌ను ఐఆర్‌-సీటీసీ అకౌంట్‌తో లింక్‌ చేయాల్సిందే. మరి ఆధార్‌తో ఐఆర్‌-సీటీసీ లింక్‌ చేయడమెలా?

Published : 14 Jul 2021 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఆర్‌సీటీసీలో నెలకు ఆరు కంటే ఎక్కువ (గరిష్ఠంగా 12) రైల్వే టికెట్లను బుక్‌ చేయాలంటే ఇకపై మీ ఆధార్‌ను ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో లింక్‌ చేయాల్సిందే. ఈ మేరకు ఆధార్‌ లింక్‌ను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌టీసీ) తప్పనిసరి చేసింది. అయితే, అకౌంట్‌తో ఆధార్‌ లింక్‌ చేయని వినియోగదారులు గరిష్ఠంగా ఆరు రైల్వే టికెట్లను యథావిథిగా బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. మరి ఆధార్‌తో ఐఆర్‌సీటీసీ లింక్‌ చేయడమెలాగో తెలుసుకుందామా? 

ఆధార్‌ లింక్‌ చేయండిలా.. 

1. మొబైల్‌తో కాకుండా డెస్క్‌టాప్‌లో ‘ఐఆర్‌సీటీసీ’ ఓపెన్‌ చేసి మీ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వండి. 

2. ఆపై ‘మై అకౌంట్‌’పై క్లిక్ చేసి.. డ్రాప్‌డౌన్‌లో వచ్చిన ‘లింక్‌ యువర్‌ ఆధార్‌’ను సెలెక్ట్‌ చేసుకోండి.

3. అనంతరం ఓపెన్‌ అయిన లింక్‌ ఆధార్‌ కేవైసీ పేజీలో.. మీ ఆధార్ ఖాతా పేరు, నంబర్ నమోదు చేసి, నిబంధనలపై ఒక లుక్కేసి.. ఓటీపీ కోసం క్లిక్ చేయండి.  

4. మీ ఆధార్‌ అటాచ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని సరి చూసుకొని ముందుకెళ్లండి. 

5. ఆపై చెక్‌బాక్స్‌లో మీ వివరాలను ఓసారి సరిచూసి ప్రక్రియను పూర్తిచేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని