చంద్రుడిపై బిలానికి విక్రం సారాభాయ్ పేరు
జాబిలిపై చంద్రయాన్2 కనుగొన్న ఓ అగ్నిపర్వత బిలానికి ఇస్రో శాస్ర్తవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ పేరు పెట్టారు. సారాభాయ్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో శాస్ర్తవేత్తలు ఆయనకు ఘన నివాళి ఇచ్చారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: జాబిలిపై చంద్రయాన్2 కనుగొన్న ఓ అగ్నిపర్వత బిలానికి ఇస్రో శాస్ర్తవేత్తలు భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయ్ పేరు పెట్టారు. సారాభాయ్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ఆయనకు ఘన నివాళి ఇచ్చారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఇస్రో సాధించిన విజయాలు సారాభాయ్ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. అమెరికాకు చెందిన అపోలో17, లూనార్21 మిషన్లు దిగిన ప్రాంతానికి తూర్పున 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో సారాభాయ్ బిలం ఉన్నట్లు శాస్ర్తవేత్తలు తెలిపారు. సారాభాయ్ బిలం సుమారు 1.7కిలోమీటర్ల లోతును కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. లావాతో నిండిన చంద్రుడి ప్రాంతాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సారాభాయ్ బిలం ఉపకరిస్తుందని ఇస్రో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం