నది దాటివెళ్లి టీకాలు వేస్తున్న నర్సు

కొవిడ్‌ మహమ్మారి పీడిస్తున్న వేళ ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాకు చెందిన మానతీ కుమారి అనే నర్సు నది దాటుకుని వెళ్లి, టీకాలు వేసి, అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Published : 24 Jun 2021 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి పీడిస్తున్న వేళ ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాకు చెందిన మానతీ కుమారి అనే నర్సు నది దాటుకుని వెళ్లి, టీకాలు వేసి, అందరి ప్రశంసలు అందుకుంటోంది. లతేహార్‌లోని మహువాడెన్‌లో  ప్రభుత్వ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మానతీ కుమారికి అధికారులు ఆ బ్లాక్‌లో ఉన్న ఓ గ్రామంలోని ప్రజలకు కొవిడ్‌ టీకాలు వేసే బాధ్యత అప్పగించారు. కాగా ఆ గ్రామానికి వెళ్లడానికి సరైన మార్గం లేదు. ఆ ఊరికి  చేరుకోవాలంటే నది దాటుకుని వెళ్లాల్సిందే.  ఏడాది వయసున్న పాపకు తల్లి అయిన మానతీ కుమారి ఒక భుజాన తన కూతుర్ని, మరో భుజాన వ్యాక్సిన్ల పెట్టెను తగిలించుకుని నది దాటివెళ్లి మరీ ఆ గ్రామంలోని ప్రజలకు టీకాలు వేస్తున్నారు. వర్షాలు కురిసి నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయడంలేదు. ఊరి ప్రజల ప్రాణాలు కాపాడటమే తన ప్రధాన కర్తవ్యంగా భావించి టీకాలు వేస్తున్నారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు. మానతి ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తోందని అక్కడి అధికారులు సైతం కొనియాడుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని