Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబును సాయంత్రంలోగా అరెస్ట్‌ చేయాలి: కేవీపీఎస్‌

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం

Published : 22 May 2022 13:33 IST

కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం తెల్లవారుజామున సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా జి.మామిడాడకు తరలించారు. మృతదేహానికి కుల వివక్ష పోరాట సమితి(కేవీపీఎస్‌) నాయకులు నివాళులు అర్పించారు. వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సుబ్రహ్మణ్యం రోడ్డుప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీయే తన కారులో తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీయే హత్య చేశాడని.. ఆయన్ను అరెస్ట్ చేయాలని నిన్న అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులు శవపరీక్షకు ఒప్పకోలేదు. ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేస్తామని స్థానిక ఎస్పీ హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేసి స్వగ్రామానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని