ఆరుబయట లోదుస్తులు ఆరేయడం.. అక్కడ చట్టవిరుద్ధం 

ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశానికి వివిధ చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఇక వేరే దేశాల్లో ఉన్న చట్టాలను మన దేశంతో పోల్చి చూస్తే...

Published : 16 Sep 2021 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఉన్న ప్రతీ దేశానికి వివిధ చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఇక వేరే దేశాల్లో ఉన్న చట్టాలను మన దేశంతో పోల్చి చూస్తే... కొన్ని భయంకరంగా.. మరి కొన్ని ఆశ్చర్యంగా, విడ్డూరంగా అనిపిస్తాయి. అందుకు ఉదాహరణే.. లోదుస్తులకు సంబంధించి ఓ చట్టాలు ఉండటం. వినడానికి కాస్త ఫన్నీగా అనిపించినా ఇది మాత్రం నిజం. అమెరికాలోని మిన్నెసోటాలో పురుషులు, మహిళల లోదుస్తులును ఒకేతీగ మీద ఆరబెట్టడమనేది చట్టవిరుద్ధమట. అదే థాయ్‌లాండ్‌లో అండర్‌వేర్‌ ధరించకుండా ఎవరూ ఇంటి బయటకు రావడం కుదరదనే షరతు ఉంది. ఈ నియమ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది థాయ్‌ ప్రభుత్వం. 

స్పానిష్‌లోని సెవిల్లె నగరంలో.. ఇక్కడి నివాసితులు లోదుస్తులు ఉతకడమే కాదు. ఆరుబయట ఆరేయకూడదనే నిబంధనా ఉంది. ఇక జపాన్‌లోని పలు ప్రదేశాల్లో మహిళలు లోదుస్తులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ఎన్ని రకాల అండర్‌ గార్మెంట్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లేసీ కంపెనీ లోదుస్తులను రష్యా, బ్రసెల్స్‌, కజకిస్థాన్‌ దేశాలు నిషేధించాయట. 4శాతం కంటే తక్కువ ఉన్న కాటన్‌తో వీటిని తయారు చేయడమే ఇందుకు కారణం. మహిళల శరీర రక్షణ మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు 2013లో ఈ చట్టాలను అమలు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని