
Published : 02 Dec 2021 14:54 IST
Uttar Pradesh: కళాశాలలో చిరుత హల్చల్.. ఓ విద్యార్థికి గాయాలు!
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని ఓ కళాశాలలోకి ప్రవేశించిన చిరుతపులి.. బీభత్సం సృష్టించింది. అలీగఢ్ జిల్లా ఛర్రా ప్రాంతంలోని ఇంటర్ కళాశాలలోకి ప్రవేశించిన చిరుత.. ఓ విద్యార్థిపై దాడి చేసింది. కళాశాలలోకి చిరుత రావడంతో విద్యార్థులంతా భయపడ్డారు. వెంటనే కళాశాల బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిపై చిరుత దాడి చేయడంతో గాయాపడ్డాడు. తరగతి గదిలోని కుర్చీల మధ్య చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బుధవారం ఉదయం 10గంటల సమయంలో చిరుత కళాశాలలోకి ప్రవేశించినట్లు ప్రిన్సిపల్ నిహాల్ సింగ్ తెలిపారు. పులి దాడిలో గాయపడ్డ విద్యార్థిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
Tags :