రుచి.. వాసన తిరిగి రావాలంటే ఏడాది ఆగాల్సిందే!

కరోనా సోకిన కొంతమంది వాసన, రుచి కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు భయపడాల్సిన పనేం లేదని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప చికిత్స అవసరముండదని అంటున్నారు. ఇది బాధితులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా.. కోల్పోయిన వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగి

Updated : 12 Aug 2022 15:15 IST

పరిశోధనలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకిన వారిలో కొంతమంది వాసన, రుచి కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు భయపడాల్సిన పనేం లేదని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప చికిత్స అవసరముండదని అంటున్నారు. ఇది బాధితులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా.. కోల్పోయిన వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగి ఎప్పుడు వస్తోందో వైద్యులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే.. వాసన, రుచి కోల్పోయిన బాధితులు తిరిగి ఘ్రాణశక్తి పొందడానికి ఏడాది సమయం పడుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ మేరకు జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన కథనం ప్రచురితమైంది.

పరిశోధనలో భాగంగా కరోనా కారణంగా వాసన, రుచి కోల్పోయిన 97 మందిపై పరిశోధకులు ఏడాదిపాటు అధ్యయనం చేశారు. 97 మందిలో 51 మందిని ప్రతి నాలుగు నెలలకోసారి వాసన, రుచి ఘ్రాణశక్తి తిరిగొచ్చిందో లేదో పరీక్షించుకొని నివేదిక ఇవ్వాలని కోరారు. ఎనిమిది నెలలు గడిచేసరికి స్వీయపరీక్షలు చేసుకున్న 51 మందిలో 49 మందికి ఘ్రాణశక్తి పూర్తిగా తిరిగొచ్చింది. మిగతా ఇద్దరిలో ఒకరికి పాక్షికంగా ఘ్రాణశక్తి రాగా.. మరో వ్యక్తిలో ఎలాంటి పురోగతి లేదు. మిగిలిన 46 మందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. సరిగ్గా ఏడాది పూర్తికాగానే ఈ 46 మందిని పరీక్షించగా.. వారికి వాసన, రుచి ఘ్రాణశక్తి పూర్తిగా తిరిగొచ్చిందట. దీన్ని బట్టి.. వాసన, రుచి ఘ్రాణశక్తి కోల్పోయిన కరోనా బాధితులు దానిని తిరిగి పొందడానికి ఏడాది సమయం పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని