Anand Mahindra: వారెవ్వా! భలే ఐడియా ఈ వాహనం

విన్నూత ఆలోచనలు, వైవిధ్యమైన వీడియోలు చూడాలంటే ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌పైపు ఓ లుక్‌ వేయాల్సిందే. ఆయన షేర్‌ చేసే అంశాలు అంత ఆసక్తికరంగా ఉంటాయి మరి. తాజాగా ఆయన దివ్యాంగులకు ఉపయోగపడే ఓ వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. 1నిమిషం 32 సెకన్ల నిడివి ఉండే ఈ వీడియోలో ఓ దివ్యాంగుడు వీల్‌ఛైర్‌ని మెషిన్‌ పరికరాలతో అనుసంధానం చేసి తేలికగా ముందుకు వెళ్తుంటాడు.

Published : 21 Aug 2021 16:26 IST

దివ్యాంగులకు ప్రత్యేక మోటర్‌ సైకిల్‌ వీల్‌ఛైర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విన్నూత ఆలోచనలు, వైవిధ్యమైన వీడియోలు చూడాలంటే ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌పైపు ఓ లుక్‌ వేయాల్సిందే. ఆయన షేర్‌ చేసే అంశాలు అంత ఆసక్తికరంగా ఉంటాయి మరి. తాజాగా ఆయన దివ్యాంగులకు ఉపయోగపడే ఓ వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. 1నిమిషం 32 సెకన్ల నిడివి ఉండే ఈ వీడియోలో ఓ దివ్యాంగుడు వీల్‌ఛైర్‌ని మెషిన్‌ పరికరాలతో అనుసంధానం చేసి తేలికగా ముందుకు వెళ్తుంటాడు. ‘‘ ఈ వీడియో ఎంత పాతదో, ఇందులో ఎవరున్నారు, ఎక్కడదన్న వివరాలు తెలియనప్పటికీ.. వీల్‌ఛైర్‌ సాయంతో ముందుకు వెళ్లే ఈ పరికరం ఓ అద్భుత ఆవిష్కరణ. దివ్యాంగుల జీవితంలో వెలుగునింపే ఈ ఆలోచనలకు ఎంతో ఆదరణ అవసరం. వారికి ఈ విధంగా సాయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నా ’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ ఈ పరికరాల తయారీని జాతీయ ఉద్యమంలా ప్రారంభించాలి.  స్పాన్సర్లు ముందుకు వస్తే ఎంతో మేలు జరుగుతుంది. వారికి తోడ్పాటు అందించేందుకు నేను ముందుకు వస్తా’’ అని నెటిజన్‌ తన వంతు సాయం చేసేందుకు ముందుకు రాగా.. ‘‘ఈ ఆలోచన కేవలం దివ్యాంగులకే కాదు... కొరియర్‌ చేసే వారికి, కూరగాయలు అమ్మేవారికి ఉపయోగపడుతుంది’’ అంటూ మరో నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని