చాంతాడంత చలాన్‌

భారీగా చలాన్‌ పెండింగ్‌ ఉన్న ఓ వ్యక్తిని కరీంనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనంపై 54 చలాన్లకు సంబంధించి ₹15,884లను పోలీసులు కట్టించుకున్నారు....

Published : 23 Mar 2021 15:09 IST

కరీంనగర్‌: భారీగా చలాన్‌ పెండింగ్‌ ఉన్న ఓ వ్యక్తిని కరీంనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనంపై 54 చలాన్లకు సంబంధించి ₹15,884లను పోలీసులు కట్టించుకున్నారు. అతి పొడవైన చలాన్‌ రసీదును చూపించారు. ఈ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌, నంబర్‌ ప్లేట్లను తీసివేయడం, తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్నారన్న సమాచారంతో ఎల్‌ఎండీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్‌ ప్లేట్లు లేని 25 వాహనాలపై పెండింగ్‌లో ఉన్న ₹65,975లను వాహనదారుల నుంచి కట్టించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని