Mark Zuckerberg: ఇది నా సహనానికి పెద్ద పరీక్ష..!

ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా.. పాఠశాలలకు వెళ్లకుండా చిన్నారులను ఇంటికే పరిమితం చేసింది.

Published : 08 Jun 2021 01:22 IST

కుమార్తెకు టైపింగ్ నేర్పుతూ..చమత్కరించిన మార్క్‌

వాషింగ్టన్: ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా.. పాఠశాలలకు వెళ్లకుండా చిన్నారులను ఇంటికే పరిమితం చేసింది. దాంతో పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని తల్లిదండ్రులు కొత్త విషయాలు నేర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో పిల్లల చేష్టలతో వారు తెగ అవస్థలు పడుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్ బర్గ్ కూడా చేరారు. ఆయన తన చిన్న కుమార్తె ఆగస్ట్‌కు కీబోర్డ్‌పై టైపింగ్ నేర్పిస్తున్న చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి..ఇది తన సహనానికి పెద్ద పరీక్ష అంటూ చమత్కరించారు. 

‘పిల్లలు కోడింగ్ నేర్చుకోవడానికి కానో కోడ్‌ యాప్ చాలా అద్భుతమైంది. అయితే ఒక చిన్నారికి టైపింగ్ నేర్పడమనేది చాలా క్లిష్టమైన విషయం. ఇప్పటివరకు నా సహనానికి పెట్టిన అతి పెద్ద పరీక్షల్లో ఇదొకటి. పాపా నిమిషానికి ఒకటి రెండు పదాలు టైప్ చేస్తుంది. వాటిలో తప్పులొచ్చినప్పుడు ఒకసారికి బదులు మూడు సార్లు డిలీట్ బటన్‌ను ప్రెస్ చేస్తుంది. అప్పుడు ఆ పదాన్ని మళ్లీ టైప్ చేయాల్సి వస్తుంది. అదంతా చూస్తుంటే..నేను ఓడిపోతానేమోనని అనిపిస్తుంది’ అంటూ సరదాగా పోస్టు చేశారు. ఇది నెటిజన్లను మెప్పించింది. ఈ పోస్టును షేర్ చేయడంతో పాటు లైక్ చేశారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని