COVID Restrictions: కరోనా ఆంక్షలు మళ్లీ పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో కొవిడ్‌ ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. పండుగల సీజన్‌ కావడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న.......

Updated : 29 Oct 2021 05:01 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో కొవిడ్‌ ఆంక్షల్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. పండుగల సీజన్‌ కావడంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల్ని నవంబర్‌ 30వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. దేశంలో నిన్న ఒక్కరోజే 16,156 కొత్త కేసులు రాగా.. 733 మందికి పైగా కొవిడ్‌తో మరణించారు. రికవరీ రేటు 98.20శాతంగా ఉండగా.. ప్రస్తుతం 1.60లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్న విషయం తెలిసిందే. గత నెల 28న జారీ చేసిన నిబంధనలు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో వాటిని మరోసారి పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు,  బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనం కేసులు మన దగ్గరా నమోదవుతున్నాయి. ఏవై.4.2 రకం వైరస్‌ లక్షణాలు ఉన్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిితోడు మరోవైపు సాధారణ కొవిడ్‌ కేసులు సైతం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. దీనికితోడు వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. వ్యాక్సినేషన్‌లో వెనుకబడి ఉన్న జిల్లాలపై కేంద్రీకరిస్తోంది. నవంబర్‌ నెలాఖరుకు ఆయా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని