Ts news: తెలంగాణలో పలు చోట్ల స్పల్పంగా కంపించిన భూమి

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై

Updated : 23 Oct 2021 15:41 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్‌, గోసేవ మండల్‌ కాలనీ, నస్పూర్‌లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని