TS News: యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికీ లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఏర్పాటు

Updated : 06 Nov 2021 18:01 IST

హైదరాబాద్‌: రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికీ లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. కానీ, కొనడం లేదన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయకుండా ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు.  సీడ్‌ కంపెనీలతో ఒప్పందమున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చన్నారు. వానాకాలంలో పండే వరి కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని