స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే ఎక్కువే..

గుజరాత్‌: సాత్పురా, వింధ్యచల శ్రేణుల మధ్య, నర్మదా నది ఒడ్డున నెలకొని ఉన్న ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’కి పర్యటకుల తాకిడి మెరుగ్గా ఉందని అధికారులు తెలిపారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని రోజూ సందర్శించే వారికంటే స్టాట్యూ ఆఫ్‌ యూనిటీని ఎక్కువ మంది సందర్శిస్తున్నారని గుజరాత్‌ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌గుప్తా తెలిపారు.

Published : 30 Nov 2020 22:56 IST

గుజరాత్‌: అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని రోజూ సందర్శించే వారికంటే భారత్‌లోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీని ఎక్కువ మంది సందర్శిస్తున్నారని గుజరాత్‌ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌గుప్తా తెలిపారు. ప్రధాని మోదీ ఆలోచనలను అనుసరించి దీనిని ప్రముఖ పర్యటక స్థలంగా మార్చామన్నారు. కరోనా వైరస్‌కు ముందు రోజుకు 13 వేల మంది సందర్శకులు రాగా, గత నెలలో పదివేల మంది సందర్శించినట్లు తెలిపారు. దీని ద్వారా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని గిరిజనులకు ఉపాధి లభించిందని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌ పర్యాటకశాఖ కార్యదర్శి మమతా వర్మ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం ఆహ్లాదకరంగా గడిపే సందర్శనీయ స్థలంగా దీనిని తయారు చేశామన్నారు. ఇక్కడ ఆరోగ్యవన్‌, పిల్లల కోసం న్యూట్రిషన్‌ పార్క్‌, యువతీ యువకుల కోసం క్యాంపింగ్, రివర్‌ రాఫ్టింగ్‌ వంటివి ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం సర్దార్‌పటేల్‌ జియోలాజికల్‌ పార్క్‌, అనేక రకాల పక్షులు, వృక్షాలు, వన్య మృగాలు అలరించనున్నాయని తెలిపారు. ప్రధాని సూచన మేరకు దీన్ని ఎక్కువశాతం పర్యావరణహితంగానే ఉంచామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని