పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పుర, నగర పాలక, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 2,214 డివిజన్‌, వార్డు స్థానాలకు ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి బుధవారం ఉదయం...

Updated : 10 Mar 2021 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో పుర, నగర పాలక, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 2,214 డివిజన్‌, వార్డు స్థానాలకు ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సోమవారం ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ మంగళవారం సస్పెండ్‌ చేయడంతో అక్కడా పోలింగ్‌ కొనసాగుతోంది.  నాలుగు మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 పురపాలికలు, 12 నగరపాలక సంస్థల్లో పోలింగ్‌ జరుగుతోంది.  మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని