Ap Corona: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ

Updated : 20 Aug 2021 15:52 IST

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు  తెలిపింది.  ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సడలింపు సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకు పెంచినట్లు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌తో సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని