NASA: జిల్‌.. జిల్‌.. అంతరిక్షం నుంచి టోక్యో ఒలింపిక్స్‌ జిగేల్‌ 

రాత్రిపూట టోక్యో వెలుగుల చిత్రమే అది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఈ చిత్రాన్ని తీయగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది.

Updated : 29 Jul 2021 04:44 IST

రాత్రిపూట టోక్యో వెలుగుల చిత్రాన్ని తీసిన ఐఎస్‌ఎస్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ఇంటర్నెట్‌లో అంతా టోక్యో ఒలింపిక్స్‌ సందడే దర్శనమిస్తోంది. ఓ పక్క పోటీల్లో మెడల్స్‌ గెలుచుకున్న విజేతల సంబరాలు.. మరో పక్క అక్కడ నిర్వహించే ఆటలపోటీల వివరాలు.. ఇలా వీటి అప్‌డేట్స్‌లో ఇంటర్నెట్‌ నిండిపోతోంది. తాజాగా ఆ జాబితాలోకి ఎన్నడూ చూడని ఓ చిత్రం కనువిందు  చేస్తోంది.  రాత్రిపూట టోక్యో వెలుగుల చిత్రమే అది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఈ చిత్రాన్ని తీయగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్‌ పెట్టిన 12 గంటల్లో 5.3 లక్షల లైక్స్‌, వరుస కామెంట్లతో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని