Mother Teresa: మదర్‌ థెరెసా పోస్టేజ్‌ స్టాంప్‌ విడుదల

మదర్‌ థెరెసా.. సేవ, ప్రేమకు సరైన నిర్వచనం. గురువారం ఆమె 111వ పుట్టినరోజు సందర్భంగా ఐక్యతరాజ్య సమితి ఓ పోస్టేజ్‌ స్టాంప్‌ని విడుదలచేసింది. కాగా ఈ స్టాంప్‌ ఫొటోలను యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధ్యక్షులు టీఎస్‌ త్రిమూర్తి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో మదర్‌ థెరెసా ఫొటో పక్కనే ‘‘మనం అందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు.

Published : 26 Aug 2021 23:55 IST

111వ జన్మదిన సందర్భంగా ఐకత్యరాజ్య సమితి నివాళి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మదర్‌ థెరెసా.. సేవ, ప్రేమకు సరైన నిర్వచనం. గురువారం ఆమె 111వ పుట్టినరోజు సందర్భంగా ఐక్యతరాజ్యసమితి ఓ పోస్టేజ్‌ స్టాంప్‌ని విడుదలచేసింది. కాగా ఈ స్టాంప్‌ ఫొటోలను యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధ్యక్షులు టీఎస్‌ త్రిమూర్తి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో మదర్‌ థెరెసా ఫొటో పక్కనే ‘‘మనం అందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు. కానీ చిన్న పనులను ప్రేమతో చేయొచ్చు’’ అనే క్యాప్షన్‌ జత చేసి ఉంది. 1910, ఆగస్టు 26న  ఉత్తర మేసిడోనియాలోని స్కోప్జీలో జన్మించారు మదర్‌ థెరెసా. 12ఏళ్లకే తన జీవితాన్ని సేవకే అంకితం చేశారు. 1928లో ఐర్లాండ్‌ ఏడాది అనంతరం భారత్‌లోని కోల్‌కతాకు వచ్చారు. ఆపై బాలికల సెయింట్‌ మేరిస్‌ లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1948లో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి.. పట్నాలో వైద్యశిక్షణ తీసుకొని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని స్థాపించారు. లెప్రసీ, క్షయ వ్యాధి, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ బాధితులతో పాటు పేదలను ఆదుకున్నారు. సేవారంగంలో ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. 1962లో రామన్‌ మెగసెసె అవార్డు, 1979లో నోబుల్‌బహుమతి, 1980లో భారతరత్న.. ఇలా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని