TS news : తెలంగాణలో ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ తాజాగారాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ తాజాగా

Updated : 22 Jan 2022 19:30 IST

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రోటేషన్‌ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, ఇవి అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని