Viral video: మొన్న చీరతో.. ఇప్పుడు హైహీల్స్‌తో.. గాల్లో పారుల్‌ విన్యాసాలు అదుర్స్‌!

హరియాణాకు చెందిన ప్రముఖ జిమ్నాస్ట్‌ పారుల్‌ అరోరా తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అబ్బురపరిచారు. గతంలో చీరతోనే అమాంతం గాల్లో....

Published : 25 Nov 2021 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హరియాణాకు చెందిన ప్రముఖ జిమ్నాస్ట్‌ పారుల్‌ అరోడా తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అబ్బురపరిచారు. గతంలో చీరతోనే అమాంతం గాల్లో పల్టీలు కొట్టి తన సాహసాన్ని చాటిన ఆమె‌.. తాజాగా స్కర్ట్‌, హైహీల్స్‌తో కార్ట్‌వీల్‌ ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పింక్‌ స్కర్ట్‌, బ్లూ టాప్‌తో హైహీల్స్‌ ధరించిన పారుల్‌.. గాల్లో పల్టీలు కొట్టి మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పారుల్‌ జాతీయ స్థాయిలో అనేక బంగారు పతకాలు సాధించిన జిమ్నాస్టే కాకుండా మంచి ఫిట్‌నెస్‌ మోడల్‌ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.42లక్షల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ సంచలన జిమ్నాస్ట్‌.. ‘హైహీల్స్‌’ క్యాప్సన్‌తో తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని