జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

పీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 21 Dec 2020 09:39 IST

న్యూదిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. మరోవైపు ఏపీలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష’ పేరుతో రూపొందించిన కార్యక్రమానికి ఇవాళ సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే జరగబోతోంది పైలట్‌ ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. ఈ గ్రామంలో సర్వే తీరును సీఎం పరిశీలించి, రైతులకు పట్టాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో 1920-27 మధ్యలో భూముల సర్వే జరిగింది. మళ్లీ ఇంతవరకు చేపట్టలేదు. మధ్యలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004-08 మధ్య భూభారతి పేరుతో ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఏపీలో భూధార్‌ పేరుతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. దీనికీ జగ్గయ్యపేట మండలాన్నే పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇదీ పూర్తికాలేదు. ప్రస్తుతం వాటి స్థానంలోనే రీసర్వేకు శ్రీకారం చుడుతున్నారు.

 

 

ఇవీ చదవండి
మాటలతో ఉబ్బిస్తూ.. ఖాతాల్లో ఊడ్చేస్తూ..!
భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం?

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని