TS: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతులు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా శశాంక్‌ గోయల్‌, సునీల్‌ శర్మ, రజత్‌కుమార్‌లకు పదోన్నతి లభించింది. ముఖ్యకార్యదర్శులుగా దాన కిశోర్‌, జనార్దన్‌రెడ్డి, కార్యదర్శులుగా శ్వేతామహంతి, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కె.శివకుమార్‌ నాయుడుకు పదోన్నతి లభించింది. కృష్ణభాస్కర్‌, ఇలంబర్తి, అలుగు వర్షిణి, రాజీవ్‌గాంధీ

Updated : 11 Mar 2021 14:03 IST

 

హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా శశాంక్‌ గోయల్‌, సునీల్‌ శర్మ, రజత్‌కుమార్‌లకు పదోన్నతి లభించింది. ముఖ్యకార్యదర్శులుగా దాన కిశోర్‌, జనార్దన్‌రెడ్డి, కార్యదర్శులుగా శ్వేతామహంతి, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కె.శివకుమార్‌ నాయుడుకు పదోన్నతి లభించింది. కృష్ణభాస్కర్‌, ఇలంబర్తి, అలుగు వర్షిణి, రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆర్‌.వి.కర్ణన్‌, కొర్రా లక్ష్మి, దేవసేన, వెంకట్‌రామిరెడ్డి, గౌరవ్‌ ఉప్పల్‌, మాణిక్‌రాజ్‌, చంపాలాల్‌,  సునితా భగవత్‌, షఫియుల్లా, ప్రియాంకా వర్గీస్‌లకు పదోన్నతి కల్పించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారులు వినోద్‌కుమార్‌, రామలింగం, ఆశా, ప్రదీప్‌కుమార్‌ శెట్టికి పదోన్నతి లభించింది. పూర్తిస్థాయి పీసీసీఎఫ్‌గా ఆర్‌.శోభను ప్రభుత్వం నియమించింది. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు ఐజీ నుంచి అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించింది. సజ్జనార్‌, అనిల్‌కుమార్‌, చారుసిన్హాలు పదోన్నతి పొందినవారిలో ఉన్నారు. ఇకపై సైబరాబాద్‌ కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో సజ్జనార్‌ కొనసాగనున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా అనిల్‌కుమార్‌ కొనసాగనున్నారు. ప్రస్తుతం చారుసిన్హా డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఐజీగా షానవాజ్‌ ఖాసీం, డీఐజీగా విక్రంజిత్‌ దుగ్గల్‌కు పదోన్నతి లభించింది.   ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని