ఏపీ వాటా ఇచ్చాకే పనులు ప్రారంభం: పీయూష్‌

ఏపీ ప్రభుత్వ వైఖరితో రూ.వేలకోట్ల విలువైన రైల్వే పనులు నిలిచిపోయాయని ఆ శాఖ వెల్లడించింది.

Updated : 20 Mar 2021 06:21 IST

దిల్లీ: ఏపీ ప్రభుత్వ వైఖరితో రూ.వేలకోట్ల విలువైన రైల్వే పనులు నిలిచిపోయాయని ఆ శాఖ వెల్లడించింది. రూ.1,636కోట్లు ఇవ్వనందున రూ.10వేలకోట్ల పనులు ఆగిపోయినట్లు తెలిపింది. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కడప-బెంగళూరు లైనులో 50శాతం వాటా భరిస్తామని 2006లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. రాష్ట్రం భూసేకరణ చేయకపోవడంతో పనులు ఆగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే 841కి.మీ మేర 4 లైన్ల పనులు ఆగాయని చెప్పారు. రాష్ట్రం తన వాటా ఇచ్చాక తదుపరి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గోయల్‌ గుర్తు చేశారు. వాల్తేర్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ వస్తుందని ఆయన వివరించారు. పాలన, నిర్వహణ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని