సొంతంగానే ‘యలహంక-పెనుకొండ’ ప్రాజెక్ట్

యలహంక- పెనుకొండ డబ్లింగ్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.912 కోట్లు ఖర్చు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. డబ్లింగ్‌ రైల్వే లైన్‌ పురోగతిపై హిందూపురం...

Updated : 18 Mar 2021 04:57 IST

దిల్లీ: యలహంక- పెనుకొండ డబ్లింగ్‌ రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.912 కోట్లు ఖర్చు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. డబ్లింగ్‌ రైల్వే లైన్‌ పురోగతిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.1,147 కోట్ల అంచనా వ్యయంతో 120కి.మీ మేర డబ్లింగ్‌ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 72కి.మీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2021-22 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.160కోట్లు కేటాయించినట్లు లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. 

తమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టులో 50 శాతం ఖర్చు భరిస్తామని ఏపీ చెప్పిందని.. తన వాటాలో రూ.200 కోట్లకు గాను రూ.50కోట్లే ఇచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా ఇవ్వలేమని చెప్పిందని తెలిపారు. ఏపీ వైఖరి వల్ల రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర వ్యయభారం పడుతోందని.. సొంత నిధులతోనే ప్రాజెక్టు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని