Ladakh: కేంద్రపాలిత ప్రాంతమయ్యాకనే తగ్గిన ఉగ్రవాదం!

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాతనే లద్దాఖ్‌లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇక్కడ సైన్యం, పారా మిలిటరీ బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

Published : 28 Jun 2021 18:06 IST

లద్దాఖ్‌: కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాతనే లద్దాఖ్‌లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇక్కడ సైన్యం, పారా మిలిటరీ బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు రోజుల లద్దాఖ్‌ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో) నిర్మించిన 63 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కానీ అతి త్వరలో ఆ రెండు ప్రాంతాల్లోనూ తిరిగి రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని మోదీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే  జమ్మూకశ్మీర్‌ రాజకీయ నాయకులతో ఆయన చర్చించారని, త్వరలో లద్దాఖ్‌ నేతలతోనూ సమావేశం కానున్నారని స్పష్టం చేశారు. లొంగిపోయిన ఉగ్రవాదులు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నందుకు భారత సైన్యాన్ని రాజ్‌నాథ్‌ ప్రశంసించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని