Karnataka: ఉడిపిలో చిక్కిన అరుదైన ‘ఘోల్’ చేప.. ధర వింటే అవాక్కే..!

కర్ణాటకలో అరుదైన చేప.. ఓ మత్య్సకారుడిని లక్షాధికారిని చేసింది. ఉడిపి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలకు

Published : 25 Nov 2021 15:10 IST

ఉడిపి: కర్ణాటకలో అరుదైన చేప.. ఓ మత్య్సకారుడిని లక్షాధికారిని చేసింది. ఉడిపి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలకు అరుదైన చేప 'ఘోల్  ఫిష్' చిక్కింది. ఆ చేప బరువు 18 కేజీలు ఉంది. మత్య్సకారుడు ఆ చేపను మాల్పే ఓడరేవులో వేలానికి పెట్టాడు. 18 కిలోల బరువున్న ఈ ఘోల్ ఫిష్ ధర రూ.1.80 లక్షలు పలికింది. కిలోకు రూ.10 వేల చొప్పున ధర లభించడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చేపలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. విదేశాలలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సాధారణంగానే కేజీ ఘోల్ ఫిష్ రూ.9,000-10,000 వరకు పలుకుతుంది. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చేప చాలా అరుదుగా వలకు చిక్కుతుందని స్థానికులు చెబుతున్నారు. 

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని