రోబో వంట.. అదిరెనంట..
బీ ఏ రోబోట్ 5- BR నోరూరించే వంటలను ఇట్టే క్షణాల్లో వండి వారుస్తోంది.
వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబోల గురించి మనం విన్నాం.. చూశాం.. రోబో సినిమాలో చిట్టి వంటలు చేసినా.. అది కల్పితం. కానీ, స్పెయిన్ రోబో ఇంజినీర్లు ఆ కల్పితాన్ని కూడా నిజం చేశారు. వాళ్లు అభివృద్ధి చేసిన బీ ఏ రోబోట్ 5- BR నోరూరించే వంటలను ఇట్టే క్షణాల్లో వండి వారుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. ఇప్పటికే రోబోలు పలు రంగాల్లో సేవలు అందిస్తోన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా స్పెయిన్ వాళ్లు వంటను చేసే రోబోలను కూడా సృష్టించేశారు. రోబో సినిమాలో చిట్టి వంటలు చేసినట్టే మ్యాడ్రిడ్లోని హోటల్లో ఆ రోబో కూడా క్షణాల్లో రుచికరమైన వంటలు చేసేస్తోంది. స్పెయిన్‌కు చెందిన బీఆర్-5 కంపెనీ ఈ రోబోను ఆవిష్కరించింది. ఈ రోబో స్పెయిన్ ప్రసిద్ధ వంటకాలను రుచికరంగా వండుతోంది. ఇంకేం ఈ రోబో వండిన రుచికరమైన ఆహార పదార్థాలను తిన్న మాస్టర్ చెఫ్‌లందరూ అద్భుతమని పొగిడేస్తున్నారు. ఇది వండి వార్చిన వంటలను లొట్టలేసుకొని తింటున్నారు.
ఒకేసారి 20 మందికి వంట చేస్తుంది..
రోబోట్‌లో ఎలక్ర్టానిక్ నియంత్రిత స్టవ్, యంత్రసాయంతో పనిచేసే చేయి కలిపి అభివృద్ధి చేసినట్టు బీఆర్-5 వ్యవస్థాపకుడు ఎన్రిక్లిల్లో తెలిపారు. జపాన్‌లో ఇప్పటికే ఈ రోబోలు వంటలు చేసేస్తున్నాయని తెలిపారు. ఇది ఒకేసారి గరిష్ఠంగా 20 మందికి వంట చేయగలదని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?