శెభాస్‌ పోలీస్‌..  క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయేవి!

కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వ్యక్తిని కాపాడిన ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్‌కు ఇంటర్నెట్‌లో......

Published : 11 Feb 2021 01:22 IST

విశాఖలో ప్రయాణికుడి ప్రాణాల్ని కాపాడిన మహిళా పోలీస్‌ 

విశాఖ: కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వ్యక్తిని కాపాడిన ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్‌కు ఇంటర్నెట్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్షణాల్లోనే అక్కడికి పరుగెత్తి ప్రయాణికుడి ప్రాణాల్ని కాపాడటంలో ఆమె అప్రమత్తతను కొనియాడుతూ రైల్వే మంత్రిత్వశాఖ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 8న విశాఖపట్నంలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ కింద జారిపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ అప్రమత్తంగా వ్యవహరించి మరికొందరు పోలీసు సిబ్బందితో కలిసి అతడిని పక్కకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వేశాఖ బుధవారం విడుదల చేసింది. ‘మానవత్వానికే తొలి సేవలు’ అని పేర్కొంది. ఈ వీడియో ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి అమర్చిన కెమెరాలో రికార్డయినట్టు పోస్ట్‌లో పేర్కొంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆ ప్రయాణికుడి ప్రాణాల్ని కాపాడిన మహిళా కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు. ఆమె చేసిన ఈ పనికి ఏ అవార్డు, రివార్డు సరిపోదని కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చదవండి..

ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ సేఫ్..! 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని