సోషల్‌ మీడియా కట్టడిపై కేంద్రానికి నోటీసులు

సామాజిక మాధ్యమాల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి తెలపాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాల వ్యాప్తికి సోషల్‌ మీడియా సంస్థలను బాధ్యులను చేస్తూ వాటిపై చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు... 

Published : 02 Feb 2021 01:16 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి వెల్లడించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాల వ్యాప్తికి సోషల్‌ మీడియా సంస్థలను బాధ్యులను చేస్తూ వాటిపై చర్యలు చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ వార్తల వ్యాప్తి వేగంగా జరుగుతోందని.. వాటి కట్టడికి కేంద్రం చట్టాలను రూపొందించాలని వినీత్‌ జిందాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అలానే అసత్య వార్తల వ్యాప్తికి సోషల్‌ మీడియా సంస్థలను బాధ్యులను చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్‌ అయిన వెంటనే వాటిని గుర్తించి తక్కువ కాల వ్యవవధిలో తొలగించేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని పిటిషన్‌లో కోరారు. అసత్య వార్తల ప్రచారం వల్ల దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత నెలలో కూడా సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్రం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని మహేక్‌ మహేశ్వరి అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్‌ మీడియా సంస్థలతో తలెత్తే ఇబ్బందుల గురించి అప్పీలు చేసేందుకు పార్లమెంటులో చట్టం చేసే వరకూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

వాట్సాప్‌ టు టెలిగ్రాం..చాట్ హిస్టరీ మార్చేయండిలా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని