విద్యార్థే, కానీ ట్వీట్‌తో సమస్యపై గెలిచాడు!

ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్న ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తేవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులోభాగంగా ట్విటర్‌ వేదికగా నిత్యం ఎంతోమంది తమ ఇబ్బందుల్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 12 Jan 2021 04:10 IST

భువనేశ్వర్‌: ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్న ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తేవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో భాగంగా ట్విటర్‌ వేదికగా నిత్యం ఎంతోమంది తమ ఇబ్బందుల్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ పాఠశాల విద్యార్థి తనకు ఏర్పడిన బస్సు సమస్యను ట్విటర్‌ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. 

వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌కు చెందిన సాయి అన్వేష్‌ స్థానికంగా ఎంబీఎస్‌ పాఠశాలలో చదువుతున్నాడు. తాను పాఠశాలకు ఉదయం 7:30గంటల కల్లా చేరుకోవాలి. కానీ వెళ్లాల్సిన బస్సు మాత్రం తన ప్రాంతానికి 7:40గంటలకు వస్తోంది. దీంతో తాను పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని పేర్కొంటూ.. ఈ విషయాన్ని భువనేశ్వర్‌ క్యాపిటల్‌ అర్బన్‌ రవాణా శాఖ(సీఆర్‌యూటీ)కు, సీఆర్‌యూటీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి అరుణ్‌ బాత్రాకు ట్విటర్‌లో ట్యాగ్‌ చేశాడు. 

ఈ క్రమంలో విద్యార్థి ట్వీట్‌కు అరుణ్‌ స్పందిస్తూ.. ‘సాయికి కలిగిన ఇబ్బందిని తొలగిస్తూ.. ఇకనుంచి ఉదయం 7గంటలకే తన ప్రాంతానికి బస్సు వస్తుంది’  అని హామీ ఇచ్చారు. అనంతరం బస్సు వేళల్లో మార్పులు చేస్తూ సీఆర్‌యూటీ సైతం కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది. అందులో భాగంగా బస్సు ఈ రోజు ఉదయం 7గంటలకే ఆ విద్యార్థి ప్రాంతానికి రాగా.. సాయి బస్సు ఎక్కిన ఫొటోను అరుణ్‌ ట్వీట్‌లో షేర్‌ చేశారు. దీంతో ఆ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాగా అధికారుల స్పందనపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి

సాగు చట్టాలను నిలిపివేయండి.. లేదా స్టే ఇస్తాం



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని