
2020 టిప్ ఛాలెంజ్..!
వాషింగ్టన్: యూఎస్‌లోని రెస్టారెంట్లో పనిచేస్తోన్న ఓ సర్వర్ తీపి జ్ఞాపకంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ముగింపు పలుకుతున్న ఏడాదికి చిహ్నంగా ఓ కస్టమర్ నుంచి 2020 డాలర్లు టిప్పుగా అందుకున్నారు. ఫ్లొరిడాలో ప్రవాస భారతీయులు నడిపిస్తోన్న రెస్టారెంట్ అందుకు వేదికైంది. ఈ టిప్పు వివరాలు నెట్టింట్లో షేర్ చేయగా, ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
‘2020 డాలర్లు టిప్‌గా ఇచ్చి, మా రెస్టారెంట్లో పనిచేస్తోన్న డాన్ పట్ల ఓ కస్టమర్ తన ఉదారత చాటుకున్నారు. మేం సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నాం. మాతో సహా ప్రతి రెస్టారెంట్‌కు 2020 అతి క్లిష్టమైన సంవత్సరం. ఆ కస్టమర్ చూపిన ప్రేమ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారికి మా కృతజ్ఞతలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని టిప్పు వివరాలు షేర్ చేసి, ఆ రెస్టారెంట్ తన కృతజ్ఞతను చాటుకుంది. అయితే కస్టమర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఇచ్చిన మొత్తాన్ని బట్టి చూస్తుంటే..అది 2020 టిప్ ఛాలెంజ్ కావొచ్చని భావిస్తున్నారు. ఆ ఛాలెంజ్ కింద 2020 డాలర్లు లేక 20.20 డాలర్లు టిప్పు కింద ఇచ్చి, అవసరంలో ఉన్నవారికి సంతోషాన్ని పంచుతారు. కాగా, ఆ కస్టమర్ ఉదారగుణాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి: