Covid Variant: మరో కొత్త రకం.. మధ్యప్రదేశ్‌లో ఏవై.4 వేరియంట్‌!

కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్‌ రాజ్యమేలగా.. తాజాగా మధ్యప్రదేశ్​లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది.....

Updated : 26 Oct 2021 05:44 IST

ఇండోర్‌: కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్‌ రాజ్యమేలగా.. తాజాగా మధ్యప్రదేశ్​లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. ఇండోర్‌లో ఆరుగురు వ్యక్తులకు కొత్తగా ఏవై.4 వేరియంట్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. బాధితులంతా కరోనా​ టీకా పూర్తి డోసులు తీసుకున్నప్పటికీ.. వైరస్​ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇండోర్‌ ముఖ్య వైద్యాధికారి బీఎస్ సైత్య మాట్లాడుతూ.. ‘దిల్లీలోని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం సెప్టెంబరులో దిల్లీకి పంపగా తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏవై.4 రకం కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. బాధితులంతా కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్నవారే. చికిత్స తర్వాత వారంతా కోలుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మరో 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని వైద్యాధికారి వెల్లడించారు. ఏవై.4 ఓ కొత్త రకం వేరియంట్​ అని.. దీనికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదని ఇండోర్​లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా మూతా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని