Mucormycosis: వికారాబాద్‌లో అమానుష ఘటన

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలుండడంతో తననే వైద్యం చేయించుకోమని చెప్పి కుమారుడు వదిలేసి వెళ్లిపోయాడు.

Updated : 28 May 2021 04:23 IST

హైదరాబాద్‌: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండటంతో తననే వైద్యం చేయించుకోమని చెప్పి కుమారుడు వదిలేసి వెళ్లిపోయాడు. రుక్కుంపల్లికి చెందిన చంద్రయ్య ఈ నెల 3వ తేదీన కరోనా సోకి, తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. బుధవారం చంద్రయ్యకు  బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడి కన్ను, నుదుటి భాగంలో వాపు, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తెలిసిన చంద్రయ్య కుమారుడు తండ్రిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆసుపత్రి ప్రాంగణంలో పడిగాపులు కాస్తున్న చంద్రయ్యను గమనించిన ఆశా వర్కర్‌ వైద్యులను సంప్రదించారు. చంద్రయ్యకు ఉన్నవి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలేనా? కాదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం చంద్రయ్యను వికారాబాద్‌ మహావీర్‌ ఆసుపత్రికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని