మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతాం: ద.మధ్యరైల్వే

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని భావిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. టికెట్‌ ఖరారైన ప్రయాణికులకు మాత్రమే...

Updated : 07 Jan 2021 19:33 IST

హైదరాబాద్‌: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని భావిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. టికెట్‌ ఖరారైన ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో అనుమతి ఉంటుందని.. ఇతరులకు ప్లాట్‌ఫాంపై కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్‌, హౌరా, ముంబయి, న్యూదిల్లీ, గువహటి, దానాపూర్‌, జైపూర్‌, నాగ్‌పుర్‌, నాందేడ్‌, పర్బాని, ఔరంగాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మొదలగు ప్రాంతాలకు పండగ ప్రత్యేక రైళ్లు నడుపుతామని వివరించింది.

ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సరిపడా రిజర్వేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని.. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు మాస్క్‌లు ధరించి స్టేషన్‌లో భౌతికదూరం పాటించాలని కోరింది. జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలున్న వాళ్లు ప్రయాణం చేయొద్దని సూచించింది. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి అందరూ సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

ఇవీ చదవండి..

కిడ్నాప్‌ కేసులో ఏ1గా అఖిలప్రియ

లేఅవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే..: జగన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని