South central Railway: దీపావళికి ఊరు వెళ్లాలనుకుంటున్నారా? ప్రత్యేక రైళ్లు.. వాటి రూట్‌లు ఇవే..!

దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ల నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ వేళ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు వాటికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

Published : 24 Oct 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ల నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ వేళ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు వాటికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  విశాఖపట్టణం- సికింద్రాబాద్‌, విశాఖపట్టణం- తిరుపతి మధ్య ఈ రైళ్లు ఉంటాయి. మరి ఆ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్‌, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? అనేవి కింద ఇచ్చిన చిత్రంలో ఉన్నాయి. కాగా ఈ  ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని