ప్రభుత్వ లాంఛనాలతో మిల్కాసింగ్‌ అంత్యక్రియలు

స్ప్రింట్‌  దిగ్గజం మిల్కా సింగ్‌ అంత్యక్రియలను పంజాబ్‌ ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో జరిపించింది.

Published : 19 Jun 2021 21:40 IST

చండీగఢ్‌: స్ప్రింట్‌  దిగ్గజం మిల్కా సింగ్‌ అంత్యక్రియలను పంజాబ్‌ ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్‌ గవర్నర్‌ వీపీ సింగ్‌ బండోరే, హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్‌ సింగ్‌ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మిల్కాసింగ్‌ చితికి ఆయన కుమారుడు జీవ్‌ మిల్కాసంగ్‌ నిప్పంటించారు. మిల్కా సింగ్‌ మృతికి సంతాపంగా రాష్ట్రంలో ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. పటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడుతున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

మిల్కాసింగ్‌ నివాసానికి వెళ్లిన అమరీందర్‌ సింగ్‌.. 1960లో పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌ ఖాలిక్‌ను లాహోర్‌లో ఓడించిన సందర్భంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విజయం తర్వాతే పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ మిల్కా సింగ్‌ను ‘ఫ్లయింగ్‌ సిక్‌’ అనే పేరుతో సంభోదించారు. గత నెల కరోనా బారిన పడ్డ మిల్కాసింగ్‌.. అనంతరం పలు అనారోగ్య కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య నిర్మల్‌ కౌర్‌ కూడా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని