Charminar: ఇకపై చార్మినార్‌ దగ్గరా ‘సండే ఫన్‌ డే’

ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్ వద్దా చేపడుతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్ సోమవారం ట్వీట్‌ చేశారు. ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపాలక శాఖా మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.

Published : 12 Oct 2021 01:44 IST

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్ వద్దా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్ సోమవారం ట్వీట్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్దా నిర్వహించాలని ఇద్దరు మంత్రులు సూచించారన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని, ఈ మేరకు ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రాత్రి 11.30 గంటలకు దాటాక చార్మినార్‌ దగ్గర ఉంటే పోలీసులు ఇళ్లకు వెళ్లండంటూ పంపిచేస్తున్నారని, అలా కాకుండా నైట్‌లైఫ్‌ని ఆస్వాదించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని