తెరుచుకున్న తాజ్‌మహల్‌.. సందర్శకుల సందడి

కరోనా మహమ్మారి కారణంగా 60 రోజులుగా మూతబడిన ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ తిరిగి తెరుచుకుంది. దీంతో సందర్శకుల సందడి మళ్లీ మొదలైంది....

Published : 16 Jun 2021 23:39 IST

ఆగ్రా: కరోనా మహమ్మారి కారణంగా 60 రోజులుగా మూతబడిన ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ తిరిగి తెరుచుకుంది. దీంతో సందర్శకుల సందడి మళ్లీ మొదలైంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. పురావస్తు శాఖ పరిధిలోని అన్ని స్మారక కట్టడాలు, స్థలాలు, ప్రదర్శనశాలల్ని బుధవారం తెరిచారు. ఒకసారి 650 మందికి మాత్రమే తాజ్‌మహల్ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతర కట్టడాల విషయంలో ఇలాంటి నిబంధనలు లేవని వెల్లడించారు. 

కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ తాజ్‌మహల్‌ వద్దకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సందర్శకులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. ఎక్కడా కట్టడాలను తాకరాదని పురావస్తు శాఖ అధికారులు సూచించారు. బుకింగ్‌లన్నీ ఆయా రాష్ట్రాలు, విపత్తు నిర్వహణ యంత్రాంగాలు జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని