Ts News: ‘మన సంస్కృతి, సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి’: తలసాని

విదేశీ సంస్కృతి వల్ల క్రమంగా సంప్రదాయాలు మర్చిపోతున్నారని.. మన సంస్కృతి, సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని

Published : 16 Jan 2022 03:22 IST

హైదరాబాద్‌: విదేశీ సంస్కృతి వల్ల క్రమంగా సంప్రదాయాలు మర్చిపోతున్నారని.. మన సంస్కృతి, సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన పతంగుల పండుగ సంబురాల్లో తలసాని పాల్గొన్నారు. తెలగు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకొనే పండగ సంక్రాంతి అని పేర్కొన్నారు. పతంగుల పండుగను సంక్రాంతికి ముందు నుంచే జరుపుకుంటారన్నారు. పండగలు, వాటి విశిష్టత గురించి తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలన్నారు. పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. ప్రజలు సంతోషంగా, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని