Corona: తెలంగాణలో కొవిడ్‌ కేసులు మళ్లీ 4వేలకు పైనే.. జీహెచ్‌ఎంసీలోనే అత్యధికం!

తెలంగాణలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే .....

Published : 25 Jan 2022 19:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,13,670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 36,269కి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 94.57శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1450 పాజిటివ్‌ కేసులు బయటపడగా.. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 432, రంగారెడ్డి 322, హనుమకొండ 201, ఖమ్మం 145, కరీంనగర్‌ 112, నల్గొండ జిల్లాలో 138 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని