Amaravati Padayatra: ‘మహాపాదయాత్ర’లో మహిళల పాదాలకు క్షీరాభిషేకం

ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం..

Updated : 24 Nov 2021 11:21 IST

అమరావతి: ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు క్షీరాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటూ కాళ్లను పాలతో అభిషేకించారు. అలాగే యాత్రకు తనవంతుగా రూ.3లక్షల విరాళం అందజేశారు. నెల్లూరు జిల్లా తెదేపా నేత బీద రవిచంద్ర కూడా మహాపాదయాత్రకు రూ.3లక్షలు అందించారు.

మరోవైపు ఇవాళ నెల్లూరు జిల్లా సున్నంబట్టి నుంచి మొదలైన పాదయాత్ర రాజుపాలెం వరకు 15కి.మీ. మేర సాగనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని