Anand Mahindra: ఆ వ్యసనాల నుంచి బయటపడటం తెలుసుకోవాల్సిందే..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్ చేశారంటే.. అందులో కచ్చితంగా ఆలోచింపజేసే విషయం ఉంటుంది. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో పంచుకొని, దాని ద్వారా వ్యాపార సూత్రాన్ని వెల్లడించారు. చూడటానికి నవ్వు తెప్పించేదిగానే ఉన్నప్పటికీ.. అలవాటు అనేది మనకు ఎంతలా వ్యసనంగా మారుతుందో తెలియజేశారు. 

Updated : 13 Oct 2021 04:16 IST

నెట్టింట్లో వీడియో షేర్ చేసి, వ్యాపార సూత్రం చెప్పిన మహీంద్రా

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్ చేశారంటే.. అందులో కచ్చితంగా ఆలోచింపజేసే విషయం ఉంటుంది. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో పంచుకొని, దాని ద్వారా వ్యాపార సూత్రాన్ని వెల్లడించారు. చూడటానికి నవ్వు తెప్పించేదిగానే ఉన్నప్పటికీ.. అలవాటు అనేది మనకు ఎంతలా వ్యసనంగా మారుతుందో తెలియజేశారు. 

ఆ వీడియోలో యజమాని తన శునకం సులభంగా బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసినప్పటికీ.. రోజులాగే తలుపు తీసేవరకు అది అక్కడే ఎదురుచూడటం మనకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి తలుపు తీసిన తర్వాతే అది బయటకు వెళ్తుంది. కొత్తగా వచ్చిన మార్పు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇన్ని రోజులుగా ఉన్న అలవాటు నుంచి అది బయటకు రాలేకపోయింది. ఆనంద్‌ మహీంద్రా ఈ వీడియోను నెట్టింట్లో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు. ‘ఒక అలవాటు మనకెంత వ్యసనంగా మారిందో వివరించేందుకు ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. ఆ అలవాటు నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడమే ఈనాటి విలువైన వ్యాపార సూత్రం’ అంటూ కొన్ని అనవసరమైన అలవాట్ల నుంచి బయపడాల్సిన ఆవశ్యతను వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని