AP News: పీఆర్సీ జీవోల అమలుకుఏపీ కేబినెట్ ఆమోదముద్ర
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను
అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 20 శాతం రిబేట్.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. ‘ఈబీసీ నేస్తం’ చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదం సమ్మతించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ